పెన్‌డౌన్‌తో ఉపాధి హామీ ఉద్యోగుల నిరసన

పెండింగ్ వేతనాల విడుదలతో పాటు పే స్కేల్ అమలు చేయాలని డిమాండ్ కాకతీయ, ఏటూరునాగారం: న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర సంయుక్త చర్యా సమితి (జేఏసీ) ఇచ్చిన పిలుపు మేరకు మంగపేట మండలంలోని ఉపాధి హామీ పథకం ఉద్యోగులు శుక్రవారం పెన్‌డౌన్, షెడ్‌డౌన్ నిర్వహించి నిరసన వ్యక్తం చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఎదుట విధులు బహిష్కరించి ఆందోళన చేపట్టిన ఉద్యోగులు ప్రభుత్వం వెంటనే తమ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఉపాధి హామీ పథకం మండల కార్యక్రమ అధికారి...