ఉద్ధృతంగా గోదావరి.. అప్రమత్తంగా ఉండండి
మూడో ప్రమాద హెచ్చరిక జారీ లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఎస్పీ హెచ్చరిక కాకతీయ, ఏటూరునాగారం : ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల ప్రభావంతో గోదావరి నదికి వరద ప్రవాహం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ప్రస్తుతం నదిలో నీటిమట్టం మూడో ప్రమాద హెచ్చరిక స్థాయికి చేరిన నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ కేకన్ సుధీర్ రామ్‌నాథ్ సూచించారు. లోతట్టు ప్రాంతాలు, బ్యాక్‌వాటర్ ప్రభావిత గ్రామాల ప్రజలు పరిస్థితిని ఎప్పటికప్పుడు గమనిస్తూ పోలీసు, రెవెన్యూ, విపత్తు నిర్వహణ శాఖల...