భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి…మొదటి ప్రమాద హెచ్చరిక…
భద్రాచలం వద్ద 43 అడుగులకు చేరిన గోదావరి...మొదటి ప్రమాద హెచ్చరిక... సాయంత్రానికి రెండో హెచ్చరిక అవకాశం... వరద ఉధృతి కొనసాగింపు... 48 అడుగులు దాటితే రెండో, 53 అడుగులు దాటితే మూడో హెచ్చరిక... లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారుల సూచన... కాకతీయ,కొత్తగూడెం ప్రతినిధి: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు గోదావరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం బుధవారం 43 అడుగులకు చేరుకుంది.దీంతో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నీటిమట్టం క్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో...