ఎమ్మార్పీకి మించి విక్రయిస్తే కఠిన చర్యలు : ఎక్సైజ్ సీఐ ప్రశాంతి

'మద్యం దందాలో సిండికేట్ రాజ్' కథనంపై ఎక్సైజ్ శాఖ స్పందన కాకతీయ, కారేపల్లి: ప్రభుత్వం నిర్ణయించిన ఎమ్మార్పీ ధరలకే మద్యం విక్రయాలు జరగాలని, అధిక ధరలు వసూలు చేసినా, అక్రమంగా మద్యం తరలించినా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని ఎక్సైజ్ సీఐ ప్రశాంతి హెచ్చరించారు. కారేపల్లి మండలంలో మద్యం విక్రయాల్లో సిండికేట్ దందా, ఎమ్మార్పీకి మించి ధరల వసూళ్లు, గ్రామాలకు ఆటోల ద్వారా అక్రమ మద్యం సరఫరా జరుగుతోందంటూ 'మద్యం దందాలో సిండికేట్ రాజ్' శీర్షికతో కాకతీయలో ప్రచురితమైన కథనం అధికార యంత్రాంగాన్ని కదిలించింది....