విజయవంతంగా ముగిసిన ‘ఆపరేషన్ ముస్కాన్
58 కేసుల నమోదు..151 మంది బాల కార్మికుల రక్షణ చిన్నారులను విద్యాబాట పట్టించే దిశగా చర్యలు కాకతీయ, కరీంనగర్ : జిల్లాలో బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు ప్రతి చిన్నారికి విద్య హక్కు కల్పించాలనే లక్ష్యంతో నెల రోజుల పాటు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్-12 విజయవంతంగా ముగిసింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సంయుక్త ఆధ్వర్యంలో మహిళా శిశు సంక్షేమ శాఖ నేతృత్వంలో పోలీసు, కార్మిక శాఖ, చైల్డ్ హెల్ప్‌లైన్-1098, సమగ్ర బాలల పరిరక్షణ పథకం (ఐసీపీఎస్), రెవెన్యూ, విద్యాశాఖలు, స్వచ్ఛంద సంస్థల సమన్వయంతో...