డీఎంహెచ్‌వోగా రాజారెడ్డి బాధ్యతల స్వీకరణ

కాకతీయ, వరంగల్ ప్రతినిధి: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా ప్రతి ఉద్యోగి బాధ్యతాయుతంగా, సమన్వయంతో పనిచేయాలని వరంగల్ జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డా. బి. రాజారెడ్డి సూచించారు. శుక్రవారం డీఎంహెచ్‌వోగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం జిల్లా కలెక్టర్ డా. సత్య శారదను మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందజేశారు. జిల్లాలో వైద్య, ఆరోగ్య సేవల పురోగతిపై కలెక్టర్‌తో చర్చించారు. అనంతరం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో ప్రోగ్రాం అధికారులు, శాఖాధిపతులు, సిబ్బందితో నిర్వహించిన సమీక్ష సమావేశంలో పాల్గొని పలు సూచనలు చేశారు....