మాజీ సర్పంచ్ పాయం కామరాజుకు ఎమ్మెల్యే నివాళి
మాజీ సర్పంచ్ పాయం కామరాజుకు ఎమ్మెల్యే నివాళి కాకతీయ, మణుగూరు రూరల్ : మణుగూరు మండలం తిర్లాపురం గ్రామ మాజీ సర్పంచ్ పాయం కామరాజు మృతిపై పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు శనివారం విజయనగరంలోని ఆయన నివాసానికి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు. దివంగత కామరాజు చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులర్పించిన ఎమ్మెల్యే, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం ప్రస్తుత తిర్లాపురం కాంగ్రెస్ సర్పంచ్ పాయం చిట్టెమ్మను పరామర్శించి ధైర్యం చెప్పారు. కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ...