పాపటపల్లి మత్స్యకార సంఘం ఏకగ్రీవం

పాపటపల్లి మత్స్యకార సంఘం ఏకగ్రీవం పాలకవర్గాన్ని ప్రకటించిన ఎన్నికల అధికారి అధ్యక్షుడిగా పిట్టల కొండయ్య కాకతీయ, రఘునాథపాలెం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం పాపటపల్లి ప్రాథమిక మత్స్య పారిశ్రామిక సహకార సంఘం నూతన పాలకవర్గం శనివారం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఎన్నికల అధికారి కపర్తి కిషోర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ ఆధ్వర్యంలో ఫలితాలను ప్రకటించారు. పిట్టల కొండయ్య అధ్యక్షుడిగా, దంతాల మల్లయ్య ఉపాధ్యక్షుడిగా, పోయిలబోయిన వెంకట్రామయ్య కార్యదర్శిగా ఎన్నికయ్యారు. డైరెక్టర్లుగా ఆవుల మదన్ మోహన్, గోగల సర్వయ్య, జోల అప్పారావు, తోట నారాయణ, పోతనబోయిన జగ్గయ్య, రేగూరి...