ఫన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే జైలుకే

ఫన్ పేరుతో ర్యాగింగ్ చేస్తే జైలుకే జూనియర్లకు అండగా నిలవాలి.. భయపెట్టొద్దు డ్రగ్స్, బాల్యవివాహాలు భవిష్యత్తును నాశనం చేస్తాయి మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి న్యాయ చైతన్య సదస్సులో విద్యార్థులకు అవగాహన కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: ఫన్ పేరుతో ర్యాగింగ్ చేయడం సరదా కాదని, అది నేరుగా జైలుకు తీసుకెళ్లే చట్టవిరుద్ధమైన చర్య అని మణుగూరు జ్యుడీషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ కంబపు సూరిరెడ్డి హెచ్చరించారు. శనివారం మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ ఆధ్వర్యంలో మణుగూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో...