అంగన్‌వాడీ భవనానికి 200 గజాల భూదానం
అంగన్‌వాడీ భవనానికి 200 గజాల భూదానం పేరుపల్లిలో పర్సా కుటుంబం ఉదారత గ్రామపంచాయతీ తీర్మానంతో భవన నిర్మాణానికి మార్గం కాకతీయ, కారేపల్లి: కారేపల్లి మండలం పేరుపల్లి-2 అంగన్‌వాడీ కేంద్రం శాశ్వత భవన నిర్మాణం కోసం పర్సా సూర్యప్రకాశరావు–ఛాయాదేవి కుటుంబం తమకు చెందిన 200 గజాల స్థలాన్ని విరాళంగా అందజేసింది. భూదానానికి సంబంధించిన పత్రాలను సర్పంచ్ బానోత్ పద్మావతికి అందజేయగా, గ్రామపంచాయతీ ఏకగ్రీవ తీర్మానంతో భవన నిర్మాణానికి ఆమోదం తెలిపింది. అనంతరం తీర్మాన ప్రతులను ఐసీడీఎస్ అధికారులకు అందజేశారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి సురేష్, ఐసీడీఎస్...