ప్రైవేట్ క్లినిక్‌పై ఆకస్మిక తనిఖీ

ప్రైవేట్ క్లినిక్‌పై ఆకస్మిక తనిఖీ జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ప్రదీప్ అర్హతలకు మించి వైద్య సేవల ఆరోపణలపై పరిశీలన కాకతీయ, ఏన్కూర్: ఏన్కూర్ మండల కేంద్రంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో అర్హతలకు మించి వైద్య సేవలు అందిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో జిల్లా డిప్యూటీ డీఎంహెచ్ఓ డా. ప్రదీప్ సోమవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. క్లినిక్‌లో రోగుల రిజిస్టర్లు, చికిత్స రికార్డులు, అనుమతులు, వైద్య సిబ్బంది అర్హతలను పరిశీలించి నిర్వాహకుడి నుంచి వివరణ తీసుకున్నారు. సేకరించిన వివరాలపై నివేదికను ఉన్నతాధికారులకు పంపనున్నట్లు తెలిపారు. నిబంధనల...