రేగాపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్

రేగాపై చర్యలు తీసుకోవాలి : కాంగ్రెస్ సస్పెన్షన్‌తో పాటు నిష్పక్షపాత విచారణకు సహకరించాలని డిమాండ్ కాకతీయ, పినపాక : మహిళల పట్ల అనుచితంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న పినపాక మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత రేగా కాంతారావును వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని పినపాక మండల కాంగ్రెస్ డిమాండ్ చేసింది. సోమవారం ఈ-బయ్యారం క్రాస్‌రోడ్డులో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పేరం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, మహిళల గౌరవానికి సంబంధించిన అంశాల్లో రాజకీయాలకు అతీతంగా వ్యవహరించాల్సిన బాధ్యత అన్ని పార్టీలపైనా ఉందన్నారు....