నల్లబెల్లిలో పెద్ది విగ్రహానికి భూమిపూజ

నల్లబెల్లిలో పెద్ది విగ్రహానికి భూమిపూజ అఖిలపక్షం ఏకగ్రీవ నిర్ణయానికి గ్రామస్థుల మద్దతు కాకతీయ. నల్లబెల్లి: మాజీ ఎమ్మెల్యే దివంగత పెద్ది సుదర్శన్‌రెడ్డి జ్ఞాపకార్థం నల్లబెల్లి మండల కేంద్రంలో ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి సోమవారం అఖిలపక్షం ఆధ్వర్యంలో భూమిపూజ నిర్వహించారు. గ్రామపంచాయతీ పాలకవర్గం విగ్రహ ఏర్పాటుకు ఏకగ్రీవంగా తీర్మానం చేయడంతో కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం ఏర్పడింది. ఇటీవల అనారోగ్యంతో కన్నుమూసిన పెద్ది సుదర్శన్‌రెడ్డి మరణం నర్సంపేట నియోజకవర్గ ప్రజలను తీవ్ర విషాదంలో ముంచెత్తింది. ప్రజలతో మమేకమై సేవలందించిన ఆయన సేవలను చిరస్థాయిగా నిలిపేందుకు అన్ని...