రుద్రంగిలో నేడు ఏటీసీ నిర్మాణానికి శ్రీకారం
రుద్రంగిలో నేడు ఏటీసీ నిర్మాణానికి శ్రీకారం రూ.46 కోట్లతో అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ మంత్రి వివేక్ వెంకటస్వామి హాజరు కాకతీయ, రుద్రంగి: రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో రూ.46 కోట్ల వ్యయంతో నిర్మించనున్న అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ సెంటర్ (ఏటీసీ) భవన నిర్మాణ పనులకు మంగళవారం శ్రీకారం చుట్టనున్నట్లు ఏఎంసీ చైర్మన్ చేలుకల తిరుపతి తెలిపారు. ప్రారంభోత్సవానికి రాష్ట్ర మంత్రి వివేక్ వెంకటస్వామి, ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, జిల్లా కలెక్టర్ గరిమ అగర్వాల్ హాజరుకానున్నారు. ఈ కేంద్రంలో 260 మంది విద్యార్థులకు...