రెండు బైక్‌లు ఢీ.. పాత్రికేయుడు మృతి
రెండు బైక్‌లు ఢీ.. పాత్రికేయుడు మృతి బోనకల్ రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై విషాదం కాకతీయ, బోనకల్: బోనకల్ మండల కేంద్రంలోని రైల్వే ఓవర్‌బ్రిడ్జిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ పాత్రికేయుడు మృతి చెందారు. ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొనడంతో గోవిందాపురం (ఎల్) గ్రామానికి చెందిన మంద సత్యానందం తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతుడు బోనకల్ మండల కేంద్రంలో పాత్రికేయుడిగా పనిచేస్తున్నాడు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.