ఎప్పుడు తెరుస్తారో… ఎప్పుడు మూస్తారో..!
ఎప్పుడు తెరుస్తారో... ఎప్పుడు మూస్తారో..! పెద్దవంగరలో అస్తవ్యస్తంగా అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పౌష్టికాహారానికి దూరమవుతున్న గర్భిణులు, చిన్నారులు కాకతీయ, పెద్దవంగర : గర్భిణులు, బాలింతలు, చిన్నారులకు పౌష్టికాహారం అందించేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన అంగన్‌వాడీ కేంద్రాల నిర్వహణ పెద్దవంగర మండలంలో ప్రశ్నార్థకంగా మారింది. కేంద్రాలు ఎప్పుడు తెరుస్తారో, ఎప్పుడు మూసేస్తారో తెలియని పరిస్థితి నెలకొనడంతో లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మండలంలోని బొమ్మకల్ గ్రామం రెండో అంగన్‌వాడీ కేంద్రానికి తరచూ తాళం వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసినప్పటికీ గర్భిణులు,...