బ్లాక్ మనీ పేరుతో రూ.13 లక్షల మోసం
బ్లాక్ మనీ పేరుతో రూ.13 లక్షల మోసం నిందితుడి అరెస్ట్.. 20 వేల బ్లాక్ పేపర్లు స్వాధీనం కాకతీయ, కొత్తగూడెం ప్రతినిధి: బ్లాక్ పేపర్లను రసాయనాలతో రూ.500 నోట్లుగా మారుస్తామని నమ్మించి ఓ వ్యక్తి నుంచి రూ.13 లక్షలు కాజేసిన పత్తిపాటి ప్రేమ్‌చంద్ను అశ్వారావుపేట పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టగా నిందితుడు నేరాన్ని అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు. అతని వద్ద నుంచి 20 వేల బ్లాక్ పేపర్లు, రసాయనాల సీసాలను స్వాధీనం చేసుకున్నారు....