నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ ‘మరణ శాసనం’
నిరుద్యోగుల పాలిట కాంగ్రెస్ 'మరణ శాసనం' హామీలన్నీ నీటిమూటలే : బీఆర్ఎస్ నేత ఏనుగుల రాకేష్ రెడ్డి ఉద్యోగాల భర్తీ, జాబ్ క్యాలెండర్‌పై ప్రభుత్వాన్ని నిలదీత కాకతీయ, ఖమ్మం : రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ప్రకటించిన 'యూత్ డిక్లరేషన్' నిరుద్యోగుల పాలిట మరణ శాసనంగా మారిందని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు ఏనుగుల రాకేష్ రెడ్డి విమర్శించారు. మధిర నియోజకవర్గానికి చెందిన నిరుద్యోగి గడ్డం వేణు గౌడ్‌ను పరామర్శించిన అనంతరం ఖమ్మంలోని తెలంగాణ భవన్‌లో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన...