తాడిచర్ల పీహెచ్‌సీపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ

తాడిచర్ల పీహెచ్‌సీపై డీఎంహెచ్‌వో ఆకస్మిక తనిఖీ కాకతీయ, మల్హర్: తాడిచర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా వైద్యాధికారి డాక్టర్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. సిబ్బంది హాజరు, ఓపీ రిజిస్టర్, ఔషధ నిల్వలు, స్టాక్ రిజిస్టర్లను పరిశీలించి వైద్య సేవలపై సమీక్ష నిర్వహించారు. సబ్‌సెంటర్ల వారీగా టీబీ, ఇతర ఆరోగ్య కార్యక్రమాల అమలును సమీక్షించి, పనితీరు తక్కువగా ఉన్న కేంద్రాల్లో టీబీ, ఎన్‌సీడీ స్క్రీనింగ్ను విస్తృతంగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం వనమహోత్సవంలో పాల్గొని పీహెచ్‌సీ ఆవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం అధికారులు...