ఓలా–ఉబర్ సేవలతో ఉపాధి సంక్షోభం
ఓలా–ఉబర్ సేవలతో ఉపాధి సంక్షోభం కలెక్టరేట్ ఎదుట ఆటో డ్రైవర్ల వినూత్న భిక్షాటన సంప్రదాయ ఆటో కార్మికులకు రక్షణ కల్పించాలని డిమాండ్ కాకతీయ, కరీంనగర్: ఓలా–ఉబర్ తరహా ఆటో, బైక్ టాక్సీ సేవల వల్ల సంప్రదాయ ఆటో డ్రైవర్ల ఉపాధి తీవ్ర సంక్షోభంలో పడిందని ఆరోపిస్తూ కరీంనగర్ జిల్లా ఆటో డ్రైవర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం జిల్లా కలెక్టరేట్ ఎదుట ఆటో కార్మికులు వినూత్నంగా భిక్షాటన నిర్వహించి నిరసన తెలిపారు. ప్రభుత్వం వెంటనే జోక్యం చేసుకుని ఆటో కార్మికుల జీవనోపాధిని కాపాడాలని డిమాండ్ చేశారు....