రోడ్లా.. చెరువులా..?
రోడ్లా.. చెరువులా..? డ్రైనేజీ లేక భాగ్యనగర్ తండాలో జలదిగ్బంధం కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా సింగరేణి మండలం భాగ్యనగర్ తండాలో వర్షం పడితే రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. సరైన డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో వర్షపు నీరు రోడ్లపై నిలిచిపోవడంతో పాటు ఇళ్లలోకి చేరి స్థానికులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. గుగులోత్ అంజి ఇంటి వద్ద ప్రతి వర్షానికి నీరు చేరుతుండటంతో వృద్ధ దంపతులు రాత్రిళ్లు నిద్ర లేక జాగారం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మలోత్ రాంబాబు ఇంటి వద్ద కూడా ఇదే...