స్కై స్కూల్‌లో బోనాల సందడి

స్కై స్కూల్‌లో బోనాల సందడి కాకతీయ, సిరిసిల్ల టౌన్ : వేములవాడ పట్టణంలోని సాయినగర్‌లో గల స్కై స్కూల్లో మంగళవారం తెలంగాణ బోనాల వేడుకలను వైభవంగా నిర్వహించారు. విద్యార్థులు పోతురాజుల వేషధారణలో విన్యాసాలు ప్రదర్శించగా, విద్యార్థినులు అమ్మవారి వేషధారణలో సంప్రదాయ నృత్యాలతో ఆకట్టుకున్నారు. అనంతరం తెలంగాణ చౌక్‌లో నిర్వహించిన బోనాల ప్రదర్శన స్థానికులను అలరించింది. ఈ సందర్భంగా వేములవాడ బద్ది పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించి రాష్ట్రంలో సమృద్ధిగా వర్షాలు కురిసి పాడిపంటలు బాగా పండాలని ప్రార్థించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను విద్యార్థులకు పరిచయం...