కారు–బైక్ ఢీకొని కానిస్టేబుల్ మృతి

కారు–బైక్ ఢీకొని కానిస్టేబుల్ మృతి కాకతీయ, జనగామ: జనగామ–కొమ్మాల మధ్య టోల్‌గేట్ సమీపంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ ధనుంజయ్ మృతి చెందారు. బైక్‌పై వెళ్తున్న ఆయన ఎదురుగా వచ్చిన కారును ఢీకొనడంతో తీవ్ర గాయాలపాలై ఘటనాస్థలంలోనే మృతిచెందినట్లు పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం జనగామ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ధనుంజయ్ ఇటీవల వరకు పాలకుర్తి పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహించినట్లు తెలిసింది. ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉండగా, పోలీసులు...