అటెండర్ బిక్షపతి మృతికి నివాళి

అటెండర్ బిక్షపతి మృతికి నివాళి కుటుంబానికి రూ.20 వేల ఆర్థిక సాయం కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల తహసీల్దార్ కార్యాలయంలో అటెండర్‌గా పనిచేస్తున్న సీహెచ్. బిక్షపతి మృతిపై తహసీల్దార్ జగదీశ్వర్ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. బుధవారం ఆయన బిక్షపతి కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా కార్యాలయ సిబ్బంది తరఫున అంత్యక్రియల ఖర్చుల కోసం రూ.20 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. కష్టకాలంలో కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు....