16న ములుగుకు సీఎం రేవంత్ రెడ్డి
16న ములుగుకు సీఎం రేవంత్ రెడ్డి మేడారం అభివృద్ధి పనుల పరిశీలన సమీకృత కలెక్టరేట్ ప్రారంభోత్సవం కాకతీయ, ములుగు ప్రతినిధి: రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఈ నెల 16న ములుగు జిల్లాలో పర్యటించనున్నారు. పర్యటనలో మేడారం సమ్మక్క–సారలమ్మ దేవస్థానంలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించడంతో పాటు, ములుగు పట్టణంలో నూతనంగా నిర్మించిన సమీకృత జిల్లా కలెక్టరేట్ భవనాన్ని ప్రారంభించనున్నారు. అధికారిక షెడ్యూల్ ప్రకారం ముందుగా మేడారం చేరుకుని సమ్మక్క–సారలమ్మ అమ్మవార్లను దర్శించుకునే అవకాశం ఉంది. అనంతరం మేడారం మాస్టర్‌ప్లాన్ కింద చేపడుతున్న...