జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం : కమిషనర్ వెంకన్న

జయశంకర్ ఆశయాలు స్ఫూర్తిదాయకం : కమిషనర్ వెంకన్న కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ సిద్ధాంతకర్త ఆచార్య కొత్తపల్లి జయశంకర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న అన్నారు. బుధవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన జయశంకర్ 93వ జయంతి వేడుకల్లో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సాధనలో జయశంకర్ చేసిన సేవలు చిరస్మరణీయమని కొనియాడారు. ప్రజాసేవలో ఆయన చూపిన నిబద్ధత అధికారులకు, ప్రజాప్రతినిధులకు స్ఫూర్తిగా నిలుస్తుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్ ఈసంపల్లి జోనా,...