ఇనుగుర్తి తహసిల్దార్ ఆఫీస్ కు భూ’పరిశీలన
ఇనుగుర్తి తహసిల్దార్ ఆఫీస్ కు భూ'పరిశీలన కాకతీయ,ఇనుగుర్తి: ఇనుగుర్తి మండల కేంద్రానికి మంజూరైన తహసిల్దార్ కార్యాలయం నిర్మాణానికి జిల్లా రెవిన్యూ అదనపు కలెక్టర్ అనిల్ కుమార్ బుధవారం భూ పరిశీలన చేశారు.సుమారు రూ.2 కోట్లతో మోడల్ తహసిల్దార్ కార్యాలయం నిర్మించనున్న నేపథ్యంలో ఏ సిటీ నిర్మాణం కోసం కేటాయించిన భూమి పక్కనే 1-20 గుం.(ఒక ఎకరం 20 గుంటలు) స్థలం కేటాయించారు.స్థానిక తహసిల్దార్ సుంకరి శ్రీనివాసులు,ఎంపీడీవో పార్థసారధి,సర్పంచి తమ్మడపల్లి కుమార్ తదితరులతో క్షేత్రస్థాయిలో సందర్శించిన అనంతరం అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక హంగులతో మోడల్...