జయశంకర్ జయంతి నిర్వహణలో నిర్లక్ష్యం?
జయశంకర్ జయంతి నిర్వహణలో నిర్లక్ష్యం? ఏనుమాముల మార్కెట్ అధికారుల తీరుపై విమర్శలు సాయంత్రం మాత్రమే విగ్రహానికి నివాళులు కాకతీయ, వరంగల్ ప్రతినిధి: తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ జయంతిని ఏనుమాముల మార్కెట్ అధికారులు, పాలకవర్గం నిర్లక్ష్యం చేశారంటూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా ఉదయం నుంచే జయంతి వేడుకలు నిర్వహిస్తుండగా, ఏనుమాముల మార్కెట్‌లో ఆయన విగ్రహానికి పూలమాల కూడా వేయకపోవడం చర్చనీయాంశమైంది. సాయంత్రం ఐదు గంటల సమయంలో మాత్రమే విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమని ఉద్యోగులు పేర్కొన్నారు. తెలంగాణ ఉద్యమానికి...