ఎమ్మార్వో ఆవరణలో మద్యం సేవనం.

కాకతీయ, మయూరి సెంటర్: అర్బన్ ఎమ్మార్వో ప్రభుత్వ కార్యాలయ ఆవరణములో కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తున్న దృశ్యాలు " కాకతీయ నిఘ కెమెరాకు" చిక్కాయి. ఆఫీస్ పని వేళలోనే ఓ ఆకతాయి మద్యం తాగుతూ ఆవరణంలో కనిపించడంతో వివిధ పనుల మీద ఎమ్మార్వో కార్యాలయానికి వచ్చిన స్థానికులు ఆశ్చర్యానికి గురయ్యారు. ఇలా మందుబాబులు కార్యాలయ ఆవరణంలోనే, బహిరంగంగా మందు తాగి చిందులేయడంతో కార్యాలపు సిబ్బంది ఏం చేస్తున్నారని?? స్థానికులు ప్రశ్నిస్తున్నారు. పని కోసం వచ్చే మహిళలు, వృద్ధులు ఇలాంటి వాతావరణంతో ఇబ్బంది పడుతున్నామని వాపోతున్నారు....