ఏన్కూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా గోవిందు శ్రీనివాసరావు
ఏన్కూర్ కాంగ్రెస్ ఇన్‌చార్జిగా గోవిందు శ్రీనివాసరావు కాకతీయ, ఏన్కూర్/తల్లాడ : టీపీసీసీ ఆదేశాల మేరకు ఏన్కూర్ మండల కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జిగా జిల్లా ప్రధాన కార్యదర్శి గోవిందు శ్రీనివాసరావు నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఆయన వైరా ఎమ్మెల్యే మాలోతు రాందాస్ నాయక్ను మర్యాదపూర్వకంగా కలవగా, ఎమ్మెల్యే శాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల, గ్రామ కాంగ్రెస్ కమిటీలను పారదర్శకంగా ఏర్పాటు చేసి, పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలకు సముచిత స్థానం కల్పించాలని సూచించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న...