ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రబంధానికి నిదర్శనం!

ఆపదలో ఆపన్నహస్తం.. మిత్రబంధానికి నిదర్శనం! మిత్రుడి కుటుంబానికి రూ.27 వేల సాయం.. మరో మిత్రుడి కుమార్తెకు రూ.1.10 లక్షల డిపాజిట్ కాకతీయ, కారేపల్లి: చిన్ననాటి స్నేహం చెరిగిపోకుండా కొనసాగిస్తూ ఆపదలో ఉన్న మిత్రుల కుటుంబాలకు మాదారం కే.వి. విద్యానికేతన్ పూర్వ విద్యార్థులు అండగా నిలిచారు. 2004లో పదో తరగతి చదివిన రమేష్ తల్లి లక్ష్మి ఇటీవల మృతి చెందడంతో శనివారం నిర్వహించిన సంస్మరణ సభకు హాజరైన పూర్వ విద్యార్థులు ఆమె చిత్రపటానికి నివాళులర్పించారు. అనంతరం రమేష్ కుటుంబానికి రూ.27 వేల ఆర్థిక సాయం అందించారు....