మిరప నారు కొంటే.. కన్నీళ్లే..!
మిరప నారు కొంటే.. కన్నీళ్లే..! నాణ్యత లేని నారుతో రైతుల ఆశలు ఆవిరి మొక్క ఎదుగుదల.. కాయధారణలో తేడాలతో దిగుబడులు పతనం అనుమతులు, విత్తనాల బ్యాచ్ వివరాలపై అనుమానాలు ఉద్యానవన శాఖ అండదండలున్నాయన్న ఆరోపణలు కోట్ల ‘జీరో’ వ్యాపారంతో ప్రభుత్వ ఆదాయానికి గండి కాకతీయ, ములుగు ప్రతినిధి : మిరప సాగుపై ఆశలు పెట్టుకున్న రైతులకు నారు నష్టాలే మిగులుస్తోందన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఏటూరునాగారం, కన్నాయిగూడెం మండలాల పరిధిలోని రామన్నగూడెం, ముల్లెకట్టు, శంకరాజుపల్లి ప్రాంతాల్లో కొనసాగుతున్న ప్రైవేటు మిరప నారు నర్సరీలపై అనేక అనుమానాలు...