కేసీఆర్ పర్యటనలో భద్రతా వైఫల్యమా?
కేసీఆర్ పర్యటనలో భద్రతా వైఫల్యమా? మల్లంపల్లి క్రాస్ వద్ద వాహనాన్ని చుట్టుముట్టిన కార్యకర్తలు భద్రతా ఏర్పాట్లపై బీఆర్ఎస్ శ్రేణుల ఆగ్రహం కాకతీయ,ములుగు ప్రతినిధి: వరంగల్ జిల్లా నల్లబెల్లిలో దివంగత నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పర్యటనలో ములుగు జిల్లా మల్లంపల్లి వద్ద భద్రతా లోపం కనిపించిందని బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. మల్లంపల్లి–నర్సంపేట క్రాస్ వద్ద కేసీఆర్ వాహనం చేరుకోగానే పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, అభిమానులు వాహనం చుట్టూ గుమిగూడారు. కొందరు వాహనం...