మోదీ విధానాలతో దేశం అప్పుల ఊబిలోకి

మోదీ విధానాలతో దేశం అప్పుల ఊబిలోకి కార్పొరేట్‌ శక్తులకు కొమ్ముకాస్తున్న కేంద్రం ధరల భారంతో సామాన్యుల జీవనం అతలాకుతలం రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం గాడితప్పకుండా చూడాలి కాకతీయ, చిగురుమామిడి : దేశాన్ని అప్పుల ఊబిలోకి నెట్టి, కార్పొరేట్‌, పెట్టుబడిదారుల ప్రయోజనాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని సీపీఐ జాతీయ నేత, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి విమర్శించారు. బీజేపీ పాలనకు రానున్న రోజుల్లో చరమగీతం పాడాలని ఆయన పిలుపునిచ్చారు. చిగురుమామిడి మండల కేంద్రంతో పాటు రేకొండ, పీచుపల్లి, ముల్కనూర్‌, సీతారాంపూర్‌, లంబాడిపల్లి, ఇందుర్తి, గాగిరెడ్డిపల్లి,...