యూరియా ధర పెంచారా?
యూరియా ధర పెంచారా? రూ.266 బస్తా.. రూ.300కు విక్రయం రవాణా ఖర్చుల పేరుతో రూ.34 అదనపు వసూలు అధికారుల అనుమతి ఉందా.. అయోమయంలో రైతన్నలు కాకతీయ,నర్సంపేట టౌన్ : యూరియా బస్తా ధర విషయంలో రైతుల్లో గందరగోళం నెలకొంది. ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ.266 కాగా, నర్సంపేట నియోజకవర్గంలోని పలు మండలాల్లోని సహకార సొసైటీల్లో అదే యూరియా బస్తాను రూ.300కు విక్రయిస్తున్నట్లు రైతులు చెబుతున్నారు. రవాణా ఖర్చుల పేరుతో బస్తాకు అదనంగా రూ.34 వసూలు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దీంతో యూరియా ధర పెంచారా.. లేక...