కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సన్మానం

కాళోజీ హెల్త్‌ యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు సన్మానం కాకతీయ, వరంగల్: కాళోజీ నారాయణరావు ఆరోగ్య విజ్ఞాన విశ్వవిద్యాలయం నూతన రిజిస్ట్రార్‌గా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్‌ జె. వెంకటేశ్వర్‌రావును హెల్త్‌కేర్‌ రిఫార్మ్స్‌ డాక్టర్స్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఆర్‌డీఏ) వరంగల్‌ ‘టీమ్‌ ఇగ్నైట్‌’ ప్రతినిధులు మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా శాలువాతో సన్మానించి, పూలమొక్క అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఎంజీఎం ఆస్పత్రి ఆర్థోపెడిక్స్‌ విభాగాధిపతిగా 1998–2024 వరకు సేవలందించిన డాక్టర్‌ వెంకటేశ్వర్‌రావు.. యాదాద్రి భువనగిరి ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్‌, జయశంకర్‌ భూపాలపల్లి ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌గా పనిచేశారు....