ప్రభుత్వ సాయంతో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకోవాలి
ప్రభుత్వ సాయంతో ఇందిరమ్మ ఇళ్లను పూర్తి చేసుకోవాలి కాకతీయ, మయూరి సెంటర్: ప్రభుత్వ ఆర్థిక సాయాన్ని సద్వినియోగం చేసుకుని ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరగా పూర్తి చేసుకోవాలని జిల్లా కలెక్టర్ దివాకర టీఎస్ సూచించారు. బుధవారం ఖమ్మం నగరంలోని వెలుగుమట్లలో నిర్మాణంలో ఉన్న ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకుని పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పునాది, గోడలు, స్లాబ్, తుదిదశ పనుల పురోగతిని పరిశీలించి నాణ్యతా ప్రమాణాలు పాటించేలా పర్యవేక్షించాలని సూచించారు. నిర్దిష్ట గడువులోగా నిర్మాణాలు పూర్తయ్యేలా సమన్వయంతో పనిచేయాలని...