బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి
బుల్లెట్ రైలు కారిడార్‌లో నకిరేకల్‌ను చేర్చాలి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌కు ఎంపీ చామల వినతి కాకతీయ, భువనగిరి: ప్రతిపాదిత హైదరాబాద్–చెన్నై హైస్పీడ్ రైలు కారిడార్‌లో నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గాన్ని చేర్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను కోరారు. ప్రస్తుతం ప్రతిపాదిస్తున్న గ్రీన్‌ఫీల్డ్ అలైన్‌మెంట్‌కు బదులుగా ఇప్పటికే ఉన్న ఎన్‌హెచ్–65 కారిడార్ మీదుగా బుల్లెట్ రైలు మార్గాన్ని పరిశీలించాలని సూచించారు. ఈ మార్గంతో అభివృద్ధి చెందిన పట్టణాలు, వాణిజ్య కేంద్రాలు, అధిక జనాభా ప్రాంతాలకు మెరుగైన...