బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించిన హరీష్‌కు సన్మానం
బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు సాధించిన హరీష్‌కు సన్మానం కాకతీయ, హన్మకొండ : ప్రపంచ ఫొటోగ్రఫీ దినోత్సవం సందర్భంగా జాతీయ స్థాయిలో నిర్వహించిన ఫొటోగ్రఫీ పోటీలో ‘బెస్ట్ అచీవ్‌మెంట్ అవార్డు’కు ఎంపికైన గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కార్యవర్గ సభ్యుడు, ఆంధ్రజ్యోతి దినపత్రిక డిప్యూటీ చీఫ్ ఫొటోగ్రాఫర్ వీరగోని హరీష్‌ను గ్రేటర్ వరంగల్ ప్రెస్‌క్లబ్ కమిటీ సన్మానించింది. ప్రెస్‌క్లబ్ అధ్యక్షుడు వేముల నాగరాజు ఆధ్వర్యంలో హరీష్‌కు శాలువా కప్పి, మెమొంటో అందజేశారు. ఇప్పటికే పలు అవార్డులు అందుకున్న హరీష్ భవిష్యత్తులో మరింత ప్రతిభ కనబరిచి మరిన్ని పురస్కారాలు...