తిరంగాతో హోరెత్తిన కరకగూడెం
తిరంగాతో హోరెత్తిన కరకగూడెం నవోదయ విద్యార్థుల దేశభక్తి ర్యాలీ కాకతీయ, కరకగూడెం: స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా కరకగూడెం మండలంలో జవహర్ నవోదయ విద్యార్థులు శుక్రవారం దేశభక్తి ర్యాలీ నిర్వహించారు. చేతుల్లో జాతీయ జెండాలు పట్టుకుని విద్యార్థులు కదం తొక్కడంతో కరకగూడెం పరిసరాలు దేశభక్తి నినాదాలతో మార్మోగాయి. క్రమశిక్షణతో ర్యాలీలో పాల్గొన్న విద్యార్థులు జాతీయ జెండా ప్రాధాన్యతను ప్రజలకు వివరించారు. స్వాతంత్ర్య సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ దేశ ఐక్యత, సమగ్రతను కాపాడుకోవాల్సిన బాధ్యత...