సీతారామ లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత డొల్ల!
సీతారామ లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత డొల్ల! అధికారుల పర్యవేక్షణ లేకుండానే మరమ్మతులు సీపీఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం కాకతీయ, ఏన్కూరు: కోట్లాది రూపాయల ప్రజాధనంతో నిర్మించిన సీతారామ ప్రాజెక్టు లింక్ కెనాల్ పనుల్లో నాణ్యత లోపాలు వెలుగుచూస్తున్నాయని సీపీఐ(ఎం) నాయకులు ఆరోపించారు. వినోబానగర్ నుంచి ఏన్కూరు ఎన్‌ఎస్‌పీ కెనాల్ వరకు నిర్మించిన కాలువలో నిర్మాణం పూర్తయిన కొన్ని నెలలకే సీసీ లైనింగ్ పెచ్చులు ఊడిపోవడం, పలుచోట్ల పగుళ్లు ఏర్పడటంపై ఆందోళన వ్యక్తం చేశారు. అధికారుల పర్యవేక్షణ లోపం, కాంట్రాక్టర్ల నిర్లక్ష్యమే...