జెండా తలకిందులుగా ఎగరేసిన దుగ్గొండి ఎమ్మార్వో
జెండా తలకిందులుగా ఎగరేసిన దుగ్గొండి ఎమ్మార్వో ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ తహసీల్దార్ ముస్క సమ్మక్క తీరుపై విమర్శలు కాకతీయ, వరంగల్ బ్యూరో : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ పతాకాన్ని తలకిందులుగా ఎగురవేసిన ఘటన దుగ్గొండి మండల కేంద్రంలో చర్చనీయాంశమైంది. తహసీల్దార్ ముస్క సమ్మక్క జాతీయ జెండాను ఆవిష్కరించిన సమయంలో పతాకం తలకిందులుగా ఉన్నట్లు స్థానికులు గుర్తించినట్లు సమాచారం. ఇందుకు సంబంధించిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా దుగ్గొండి మండల కేంద్రంలో అధికారులు, ప్రజాప్రతినిధులు, వివిధ శాఖల...