చదువుపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం
చదువుపై ఆసక్తి పెంపొందించడమే లక్ష్యం ప్రభుత్వ పాఠశాలలకు అవసరమైన సహకారం మౌలిక వసతుల కల్పనకు చేయూత చేయూత మిత్రబృందం నిర్వాహకులు పొదిల రాజేష్, బైరి రమణారెడ్డి విద్యార్థులకు బ్యాగులు, వాటర్ బాటిళ్ల పంపిణీ కాకతీయ, భూపాలపల్లి : స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని చేయూత మిత్రబృందం ఆధ్వర్యంలో చిన్నకోడెపాక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు శనివారం పాఠశాల బ్యాగులు, వాటర్ బాటిళ్లు, ఆక్స్‌ఫర్డ్ డిక్షనరీలను పంపిణీ చేశారు. ప్రధానోపాధ్యాయురాలు చాడ అనితారెడ్డి సమక్షంలో సుమారు 80 మంది విద్యార్థినీ, విద్యార్థులకు సామగ్రిని అందజేశారు....