పాడి పంటలు చల్లగా చూడాలమ్మా

పాడి పంటలు చల్లగా చూడాలమ్మా రాయపర్తిలో ఉట్టిపడిన భక్తి పారవశ్యం ఘనంగా మారెమ్మ, ముత్యాలమ్మ బోనాలు మారుమోగిన డప్పుచప్పుళ్లు.. శివసత్తుల పూనకాలు అమ్మవార్లకు మొక్కులు చెల్లించిన భక్తజనం కాకతీయ, రాయపర్తి : వర్షాలు సమృద్ధిగా కురిసి పాడిపంటలు చల్లగా ఉండాలని, గ్రామ ప్రజలు ఆయురారోగ్యాలతో సుభిక్షంగా జీవించాలని భక్తులు గ్రామ దేవతలను వేడుకున్నారు. ఆదివారం రాయపర్తి మండల కేంద్రంలో మారెమ్మ, ముత్యాలమ్మ తల్లుల బోనాల పండగ ఉత్సవాలు కన్నులపండువగా నిర్వహించారు. మహిళలు నిష్టతో సిద్ధం చేసిన బోనాలను శిరస్సున ధరించి మంగళ వాయిద్యాలు, డప్పుచప్పుళ్ల...