ఆగస్టు 18, 19 తేదీల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె

ఆగస్టు 18, 19 తేదీల్లో గ్రామపంచాయతీ కార్మికుల సమ్మె సమస్యల పరిష్కారానికి రాష్ట్రవ్యాప్త ఆందోళన కాకతీయ, కారేపల్లి : గ్రామపంచాయతీ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 18, 19 తేదీల్లో నిర్వహించే రాష్ట్రవ్యాప్త సమ్మెలో పాల్గొంటామని కార్మికులు తెలిపారు. ఈ మేరకు సోమవారం సింగరేణి మండల ఎంపీవోకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ సింగరేణి మండల కన్వీనర్‌ కే. నరేంద్ర మాట్లాడుతూ గ్రామపంచాయతీ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని, కనీస వేతనం రూ.26 వేలకు పెంచాలని, రెండో పీఆర్సీలో చేర్చాలని డిమాండ్‌ చేశారు....