బల్దియా పారిశుధ్యంపై ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ బృందం అధ్యయనం
బల్దియా పారిశుధ్యంపై ఎంఎస్ఎస్ఆర్ఎఫ్ బృందం అధ్యయనం వ్యర్థాల సేకరణ నుంచి ప్రాసెసింగ్ వరకు క్షేత్రస్థాయి పరిశీలన కమిషనర్ టి. వెంకన్నతో సమావేశం కాకతీయ, వరంగల్ ప్రతినిధి : గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ (జీడబ్ల్యూఎంసీ)లో అమలవుతున్న పారిశుధ్య నిర్వహణ విధానాలపై అధ్యయనం చేసేందుకు ఎంఎస్ స్వామినాథన్ పరిశోధనా సంస్థ (ఎంఎస్ఎస్ఆర్ఎఫ్), చెన్నైకి చెందిన బృందం రెండు రోజుల పర్యటనకు వచ్చింది. మంగళవారం జీడబ్ల్యూఎంసీ ప్రధాన కార్యాలయంలో కమిషనర్ టి. వెంకన్నతో సమావేశమై ఇంటింటి వ్యర్థాల సేకరణ, తడి–పొడి చెత్త వేరు చేయడం, స్వచ్ఛ ఆటోల...