అనధికారిక ఫ్లెక్సీలపై బల్దియా ఉక్కుపాదం

అనధికారిక ఫ్లెక్సీలపై బల్దియా ఉక్కుపాదం అనుమతి లేకుండా ముద్రించినా క్రిమినల్‌ కేసులు ఫ్లెక్సీ తయారీదారులకు కమిషనర్‌ హెచ్చరిక కాకతీయ, వరంగల్‌ ప్రతినిధి: నగర సుందరీకరణకు విఘాతం కలిగిస్తున్న అనధికారిక కమర్షియల్‌ ఫ్లెక్సీలపై బల్దియా కఠిన చర్యలకు సిద్ధమైంది. అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ముద్రించినా, ఏర్పాటు చేసినా క్రిమినల్‌ కేసులు నమోదు చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌ టి. వెంకన్న హెచ్చరించారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో ఫ్లెక్సీ తయారీదారులతో ఆయన ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాలు, జంక్షన్లు, మీడియన్లు, డివైడర్లు, టెలిఫోన్‌, విద్యుత్‌ స్తంభాలు,...