పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి చాటాలి..
పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి చాటాలి.. కాకతీయ, గీసుగొండ: సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆశయాలను నేటి తరానికి తెలియజేస్తూ, ఆయన చూపిన బాటలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని గౌడ సంఘం మండల అధ్యక్షుడు వల్గుల సారంగపాణి అన్నారు. మండలంలోని మచ్చాపూర్ గ్రామంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతి వేడుకలను స్థానిక గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.అనంతరం కేక్ కట్ చేసి పండ్లు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా సారంగపాణి...