ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన

ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన కాకతీయ, పెద్దవంగర : ప్రగతి సేవా సమితి ఆధ్వర్యంలో మంగళవారం పెద్దవంగర గ్రామపంచాయతీ ఆవరణలో నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. శంకర కంటి ఆసుపత్రి, నానక్‌రామ్‌గూడ కంటి హాస్పిటల్‌ సిబ్బంది కంటి పరీక్షలు నిర్వహించారు. ఈ సందర్భంగా సర్పంచ్‌ పారిజాతసురేష్‌ మాట్లాడుతూ కంటి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. కంటి సమస్యలు ఏర్పడిన వెంటనే వైద్యులను సంప్రదిస్తే చూపును కాపాడుకునే అవకాశం ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ప్రగతి సేవా...