ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు.. లేదంటే చర్యలే
ప్లాన్ ప్రకారమే నిర్మాణాలు.. లేదంటే చర్యలే భవన నిబంధనలు పాటిస్తేనే ఓసీలు ఉల్లంఘనలపై కఠిన చర్యలు తప్పవు హంటర్ రోడ్ నుంచి నక్కలగుట్ట వరకు క్షేత్రస్థాయి తనిఖీలు కమిషనర్ వెంకన్న ఆకస్మిక పరిశీలనలు కాకతీయ, వరంగల్ ప్రతినిధి : శాంక్షన్డ్ ప్లాన్ ప్రకారమే భవనాలు నిర్మిస్తే ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ (ఓసీ) జారీ చేస్తామని జీడబ్ల్యూఎంసీ కమిషనర్ టి. వెంకన్న స్పష్టం చేశారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు చేపడితే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. బుధవారం హంటర్ రోడ్, ప్రకాశ్‌రెడ్డిపేట, నక్కలగుట్ట, జూలైవాడ, ఎక్సైజ్ కాలనీ...